రైతులకు ఉచితంగా ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు ఇవ్వడం కొరకు భారత వాతావరణ సంస్థ మరియు వ్యవసాయ మంత్రాలయం ద్వారా ఒక నూతన పద్ధతిని ఆవిష్కరింపబడింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు వ్యవసాయదారులు వారి పేరు మరియు మొబైల్ నంబరుతో పాటు వారికి కావలసిన పంట వివరములను రిజిష్టరు చేసుకోగలరని కోరడమైనది. ఒకసారి రిజిష్టరు చేసుకొంటే రైతు సోదరులకు వారి పంటలకు కావలసిన దైనందిన వ్యవసాయ కార్యకలాపాలతో పాటు వాతావరణంలోని ముఖ్యమైన మార్పులను ప్రతి వారం ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా పొందవచ్చును.
ఈ క్రింద తెలిపిన సూచనల ప్రకారం రిజిస్ట్రేషను ఫారాన్ని పూర్తి చేయవలెనని రైతు సోదరులను కోరడమైనది.

1) 7 లేదా 8 లేదా 9 అంకెలతో మొదలగు తమ 10 అంకెల మొబైల్ నంబరును ఎంటరు చేయవలెను.

2) డ్రాప్ డౌను మెనును ఉపయోగించి, రాష్ట్రం, జిల్లా మరియు బ్లాకు/మండలమును ఎంచుకొనవలెను.

3) డ్రాప్ డౌను మెనును ఉపయోగించి పంట పేరును ఎంచుకొనవలెను.

4) ఇమేజ్ టెక్స్ట్ రును ఎంటరు చేయవలెను, సేవ్ ను నొక్కవలెను.

5) స్క్రీను/తెర మీద సలహాలు కనబడును. ఇంతటితో రిజిస్ట్రేషను పూర్తి అగును.

6) రిజిస్ట్రేషను/నమోదు కొరకు దయచేసి ఇచట క్లిక్ చేయండి. ఇక్కడ నొక్కండి